రేషన్ బియ్యం మాఫీయాపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హాట్ కామెంట్స్
కడపజిల్లా, ప్రొద్దుటూరు లో పౌరసరఫరాల శాఖ సంబంధించిన గోదాము నుండి డీలర్లతో సంతకాలు చేయించి, గోదాము నుండే రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు అక్రమార్కులు తరలిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు.
పేద ప్రజల రేషన్ బియ్యం నెలకు ఇరవై లారీలు అక్రమంగా బయటికి వెళుతున్నాయని, ఇది ప్రొద్దుటూరులో అధికార పార్టీ అండదండలతోనే జరుగుతోందని, బియ్యం అక్రమంగా తరలించే వారిలో, ఓ ప్రముఖ పత్రికా విలేఖరి, మరో వ్యక్తి కలిసి గోదాము నుండే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్నారన్నారు.
స్టాక్ పాయింట్ నుండే రేషన్ బియ్యం వెళుతుంటే తహసిల్దార్ డిప్యూటీ తహసీల్దార్లు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ప్రొద్దుటూరు తహసిల్దార్ వచ్చినప్పటి నుండి మూడున్నర నుండి ఐదు కోట్ల వరకు సంపాదించాడని మాజీ ఎమ్మెల్యే వరద ఆరోపణలు గుప్పించారు. ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ ఎందుకు తహసిల్దార్ పై దృష్టి కింద్రీకరించలేదు అని ఆయన అన్నారు.
బియ్యం దందా కోసమే తహసిల్దార్ ఇక్కడ ఉన్నారన్నారు. బియ్యం స్టాక్ మొత్తం నిల్వ లేకపోవడంతో నిన్నటి దినం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారన్నారు. అధికారులు, అక్రమార్కుల పై జిల్లా కలెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డిమాండ్ చేశారు.
Commentaires