ఎమ్మార్వో పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పేద ప్రజల భూములను ఇతరులకు ఆన్లైన్ చేస్తూ ప్రొద్దుటూరు తాసిల్దార్ నజీర్ అహ్మద్ 10 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు సంపాదించారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరు మండలం నంగునూరు పల్లె గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి యొక్క భూమిని నాగయ్య అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి, పాసుబుక్ కూడా ప్రొద్దుటూరు తాసిల్దార్ నజీర్ అహ్మద్ మంజూరు చేశాడని నేడు తాసిల్దార్ కార్యాలయం కు వెళ్లి తాసిల్దార్ నజీర్ అహ్మద్ పై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీలు లో ఉన్న భూమి సమస్యను పరిష్కరించకుండానే ఒక తాసిల్దార్ ఏ విధంగా పాస్ బుక్ మంజూరు చేస్తాడంటూ తాసిల్దార్ పై వరదరాజు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలమాపురం గ్రామపంచాయతీలో 1985 లో వేసిన 14 ఎకరాల వెంచర్ ను ముగ్గురు వ్యక్తుల పేరున తాసిల్దార్ నజీర్ అహ్మద్ అనుభవం సర్టిఫికెట్ మంజూరు చేసి ఆ స్థలాన్ని కల్వరి టెంపుల్ హైదరాబాద్ వారికి అమ్ముకునేలా సహకరించినందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటికి పిలిచి కోటి రూపాయలు ఎమ్మార్వో కు డబ్బు ఇచ్చాడంటూ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు తాసిల్దారు నజీర్ అహ్మద్ పై ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
Comments