అప్పులు తేవడం బటన్ నొక్కడం ఇదేనా సీఎం పని - మాజీ ఎమ్మెల్యే వరద
కడప జిల్లా, ప్రొద్దుటూరు
రైతులకు పని ముట్లు, పంటలను మద్దతు ధరలతో కొంటున్నాము అని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం అని ప్రొద్దుటూరు టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రైతులను మోసం చేస్తున్నాడని, వైసీపీ ప్రభుత్వం హయాంలో కల్తీ విత్తనాలు, కల్తీ మందులు విచ్చలవిడిగా మార్కెట్ లో అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్ ను తీవ్ర నిర్లక్షానికి గురువుతోందని, పోలవరం నిర్మాణం విషయంలో ఏపి ప్రభుత్వ వైఫల్యం చెందింది అని కేంద్రం ఆరోపిస్తుండగా అందుకు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పలేక మిన్నకుండి పోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది సూన్యం అని, ఎస్సీ, ఎస్టీ, బిసి ఇతర కార్పొరేషన్లు తగినన్ని నిధులు ఇవ్వక కొర్పొరేషన్లను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేశాడని, రాష్ట్రంలో రోడ్లు చూస్తే చాలా అద్వనమైన పరిస్థితులలో ఉన్నాయని, టెండర్లు పిలిస్తే పని చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. నీటి పాజెక్తులకు మెయింటెనెన్స్ నిధులు కూడా విడుదల చేయడం లేదని, ప్రొద్దుటూరులో ప్రభుత్వ గృహాలు ఒక వెయ్యి కూడా ఇంకా పూర్తి చేయలేకపోయారని, అప్పులు తేవడం బటన్ లు నొక్కడం ఇదేనా ముఖ్యమంత్రి పని అని ప్రశ్నించారు? వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
Comments