లంచగొండి అధికారులను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడిది - మాజీ ఎమ్మెల్యే వరద
కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మి వద్ద నలభై లక్షలు డబ్బు తీసుకుని ఎమ్మెల్యే రాచమల్లు పోస్టింగ్ వేపించాడని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎమ్మెల్యే ను కలవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పడం సబబు కాదు అని తాను చెప్పినట్లు, సబ్ రిజిస్ట్రార్ తో తనపై పోలీస్ కంప్లైంట్ ఇప్పించడానికి ఎమ్మెల్యే రాచమల్లు విశ్వ ప్రయత్నం చేశాడనన్నారు. లంచగొండి అధికారులను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందనీ, ప్రశ్నించినందుకే తనపై కేసు పెడతారా అని అన్నారు.
తాను రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి తప్పకుండా పోటీ చేసి ఎమ్మెల్యే రాచమల్లు అవినీతికి చరమగీతం పలుకుతానని, ప్రొద్దుటూరు మునిసిపాలిటినీ ఎమ్మెల్యే రాచమల్లు కబలిస్తున్నడన్నారు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతూ, ఇంత వరకు తాను ఒక్క సెంటు భూమి కొన్నట్లు లేదా అమ్మినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటు సవాల్ విసిరారు. అధికార పార్టీ లో ఉన్నారు కనుక తనపై ఎంక్వైరీ వేయించాలని, అవినీతి చేశానని నిరూపించాలన్నారు. చంద్రబాబు పై అన్యాయంగా కేసు నమోదు చేశారనీ, చంద్రబాబు ఎక్కడ ఫ్యాక్షన్ ను ప్రోత్సహించలేదన్నారు.
Comentários