మున్సిపల్ చైర్మన్ ను డమ్మీ చేసిన ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు పాత్రికేయులను అనుమతించకపోవడంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ, కౌన్సిల్లో జరిగే, జరగబోయే అంశాలపై ప్రజలకు సమాచారం తెలిపేది పాత్రికేయులేనని, అలాంటి వారిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక కూడా లేదని, మంత్రులు సలహాదారులే మాట్లాడుతున్నారని, ఇదే పద్ధతి ప్రొద్దుటూరులో కూడా ఆచరిస్తున్నారని ఆయన అన్నారు. పాత్రికేయులకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే రాచమల్లు అడ్డుకోవడం సబబు కాదని, కౌన్సిల్ తీర్మానాలు చర్చల్లోని కౌన్సిల్ లొసుగులు ఎక్కడ బయటపడతాయో అని పాలకపక్షం పాత్రికేయులను అనుమతించలేదంటూ, రానున్న రోజుల్లో కొందరు వైసీపీ కౌన్సిలర్లు టిడిపి కండువా కప్పుకునే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యే రాచమల్లుకు భయం ఆవహించిందని, కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు విభేదించిన కారణంగానే అక్కడ జరిగిన ఏ తంతు కూడా మీడియాకు తెలియకూడదు అన్న ఉద్దేశంతోనే అటు చైర్మన్ ఇటు ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారని, మున్సిపాలిటీ ని కైవసం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజును డమ్మీ చేశారంటూ ఆరోపణ చేశారు. రిజర్వేషన్లకు అనుగుణంగా బీసీలకు చైర్మన్ పదవి కేటాయించి పెత్తనం చెలాయిస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ప్రజలను మోసం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments