రైతులను విస్మరించిన వైసిపి ప్రభుత్వం - మాజీ ఎమ్మెల్యే వరద
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులతో, జిల్లా కలెక్టర్లతో రైతు సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వరదరాజుల రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వర్షాలు పడక రైతులు పొలాలను బీడుగా పెట్టుకున్నారని అయినా కడప జిల్లాలో కరువు లేదని ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా దారుణమని మాజీ ఎమ్మెల్యే వరద తెలిపారు. ప్రొద్దుటూరు ,రాజుపాలెం మండలాలలో వర్షాలు పడక ఇబ్బందులకు గురవుతున్న రైతులను, పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ,టిడిపి నేత కొండారెడ్డి మండలం లోని రైతులు పరిశీలించారు .కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాలలో ఈ సంవత్సరం వర్షాలు పడక దాదాపు 30 వేల ఎకరాల భూమిని బీడుగా పెట్టారని మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి తెలిపారు. రాజుపాలెం మండలంలో ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల ఎకరాల సెనగ పంట వేసేవారమని, అయితే ఈ సంవత్సరం వర్షాలు పడక ఒక్క ఎకరాలో కూడా శనగ విత్తనం వేయలేదని రైతులు తెలిపారు. కొద్దిపాటి చిరుజల్లులకు మినుము పంట కొంతమంది రైతులు వేశారని ,అయితే తర్వాత వర్షాలు పడకపోవడంతో ఆ పంట కూడా నాశనం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని డిసెంబర్ తర్వాత కౌలు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండబోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments