ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అరాచక పాలనకు స్వస్తి - మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య నెహ్రూ రోడ్లోని టిడిపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వైసీపీ పాలనకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని, అబద్దాల హామీతో అందలమెక్కిన జగన్ ఈ ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు ముక్కలు అవ్వడం ఖాయమని జోష్యం చెబుతూ, త్వరలో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపటం ఖాయమని అన్నారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా వేదిక పడగొట్టడంతో మొదలైన వైసీపీ అరాచక పాలన ఈ ఎన్నికలతో ముగియనున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వంగా వైసిపి మిగిలిందని అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం ప్రజలకు అందాలంటే ఈ ఎన్నికలలో టిడిపి - బిజెపి - జనసేన కూటమి అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు మార్తల ప్రవీణ్ రెడ్డి, చీమల రాజశేఖర్ రెడ్డి, జనసేన నాయకులు జిలాన్, సుంకర మురళి, తదితరులు పాల్గొన్నారు.
Commentaires