నూతన ఇసుక పాలసీపై మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య వ్యాఖ్యలు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఇసుకను దోపిడీ చేయటమె కాకుండా, భవన నిర్మాణ కార్మికుల జీవితాలను క్షిద్రం చేశారు అని, టిప్పర్ ఇసుక 9 వేల నుండి 10వేల దాకా అమ్మిన ఘనత నాటి వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించాడన్నారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకే టిడిపి ప్రభుత్వ అధికారంలోకి రాగానే నెల రోజులు గడవకముందే 43 జీవో తెచ్చి పాత పాలసీని రద్దు చేశాడన్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రకటించాడన్నారు, సీనరేజ్, జీఎస్టీ, బాడుగ మాత్రం చెల్లించాలన్నారు. దీనికోసం ఒక పాసీని తయారు చేశారన్నారని, ఇందులో ఆయా జిల్లా కలెక్టర్లు కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారన్నారు. అన్ని ప్రాంతాల్లోని ఇసుకరీచులపై ఈ కమిటీలే నిర్మాణాత్మకంగా వివరిస్తాయన్నారు. ఆన్లైన్ ద్వారానే పేమెంట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments