వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ జడ్పిటిసి భాస్కర్ ఆయన సతీమణి ఎంపీటీసీ పద్మావతి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై గత కొంత కాలంగా అలకభూనిన అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేస్తూ, రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే రాచమల్లు నాయకత్వాన్ని సవాల్ చేస్తూ తమ అసమ్మతి ఘలాన్ని వినిపిస్తున్నారు. గడచిన కొద్ది రోజుల క్రితం 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్, అలాగే నిన్న మాజీ కౌన్సిలర్లు గంజికుంట ఆంజనేయులు ఆయన సతీమణి కృష్ణవేణి టిడిపిలో చేరగా, సోమవారం ఉదయం మాజీ జడ్పిటిసి రామనాధుల భాస్కర్ ఆయన సతీమణి ఎంపీటీసీ పద్మావతి వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెళ్లాలలోని ఆయన స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, వైసిపి స్థాపించినప్పటి నుండి తాము పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తాము ఏనాడు ప్రశ్నించలేదని, విధివిధానాలు నచ్చటం వలన పార్టీలో కొనసాగామని, అయితే ప్రస్తుత పరిస్థితులలో నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీరు తమకు నచ్చటం లేదంటూ ఆరోపణలు గుప్పిస్తూ, తాను రాజకీయాలలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, తదనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్సీపి లో పని చేసినట్లు గుర్తు చేశారు. ఏనాడూ ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడలేదని, అలాంటిది నేడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం తనని కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గడచిన కొద్ది కాలంగా ఎస్సీలుగా ఉన్న తమను ఇక్కడి నాయకులు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదని అన్నారు. అనంతరం టిడిపి నాయకులు సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు.
Comentarios