కాలం చెల్లిన తినుబండరాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం
--ఆరోగ్యరీత్యా పొంచి ఉన్న ప్రమాదం.
--అయినా పట్టించుకోని అధికార గణం.
చిట్వేలి గ్రామంలో వ్యాపార సముదాయాలు ప్రధాన వీధులలో విరివిగా ఉన్నాయి. అయితే కొందరు మాత్రం తినే వారి ఆరోగ్యాన్ని విస్మరించి తమకు ఆదాయం వస్తే చాలు; ఎలాంటి క్వాలిటీ లేని వస్తువులను అమ్మడం తోపాటు వాటి గడువు తేదీ ముగిసినప్పటికీ ఎవ్వరు గమనిస్తారు లే..!!?? అన్న రీతిలో వాటిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
చిన్నపాటి ఆహారంతోనే పిల్లల నుంచి పెద్దల జీర్ణవ్యవస్థ ఇబ్బంది అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే కోవలో ఈరోజు ఉదయం మంచి బ్రాండ్ కలిగిన SUNFEEST బిస్కెట్ ప్యాకెట్ ను కొనుగోలు చేసిన వ్యక్తి, గత ఏడాది జూలై నెల చివర్లో తయారీ కాగా ఆరు నెలల వ్యవధిలోనే దాన్ని ఉపయోగించాలని ప్యాకెట్ మీద ఉన్నప్పటికీ ... సదరు వ్యాపారస్తులు వాటినే అమ్ముతూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఇవే కాదు శీతల పానీయాలు, వాటర్ బాటిల్లు తదితర వాటిని గమనించిన వారికి తెలుస్తుంది తప్ప.. మిగతా వారికి దప్పిక తీర్చుకోవడం తో పాటు అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నామన్న విషయం ఏం తెలుస్తుంది అని పలువురు అంటూ.. దీనిని గమనించాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారా ?? అన్న అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ సమస్య ఏ ఒక్క షాపుకో, మండలానికో కాదు. మండలాల నుంచి మారుమూల పల్లెలకు కూడా ప్రాకి చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించి అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని సదరు బాధితులు కోరుతున్నారు.
Comments