విజిలెన్స్, బ్రేక్ ఇన్స్పెక్టర్ అధికారులమని చెప్పి బెదిరించి కంకర చిప్స్ లారీల వద్ద నుండి భారీగా నగదు వసూలు చేస్తున్న ముఠా.
ఏలూరు జిల్లా
ఈ ముఠా నూజివీడు పట్టణంలో మైలవరం వైపు నుండి వచ్చే క్రషర్ కంకర చిప్స్ లోడ్ లారీలను ఆపి బెదిరించి వారి వద్ద నుండి నగదు వసూళ్లు చేసిన వైనం. నూజివీడు ముసునూరు తిరువూరు ప్రాంతాలలో ముఠా భారీగా నగదు వసూళ్లు. బెదిరించి నగదు వసూలు చేస్తున్న విజయవాడ రామవరప్పాడుకు చెందిన మోదలవలస పోలయ్య అనే వ్యక్తి లారీ యజమానులకు చిక్కాడు. పోలయ్య గతంలో మైనింగ్ విజిలెన్స్ అధికారుల వద్ద డ్రైవర్గా పనిచేసిన అనుభవంతో తెగించినట్లు తెలుస్తోంది.
విజయవాడ పరిసరాలలో సైతం వసూళ్లకు తెగించి రోజు కనీసం లక్ష రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. పోలయ్య మరికొందరతో ముఠాగా జట్టు కట్టి వసూళ్లకు తెగించాడు. పోలయ్య వసూళ్లలో కేవలం 10 శాతం పొందే వ్యక్తి అని, అసలు ముఠా నాయకుల వివరాలు తెలియడం లేదని లారీ యజమానులు అంటున్నారు. కిరాయిలు లేక లారీలు తిప్ప లేక, తీసుకున్న ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక అవస్థలు పడుతుంటే, అధికారుల వేధింపులు మరోపక్క తిప్పలు పెడుతోంది. ఇప్పుడు కొత్తగా నకిలీ అధికారులు అంటూ ముఠాలు వసూళ్లకు తెగబడుతుంటే ఇక లారీలు వదిలిపెట్టి ఆత్మహత్యలు శరణ్యం అంటున్న లారీ యజమానుల ఆవేదన.
ఈ సంఘటనపై పోలీసులు దృష్టి సారించి నగదు వసూలు చేస్తున్న వారి వెనుక ఉన్న అసలు ముఠా గుట్టు రట్టు చేయాలని కోరుతున్నారు.
Comments