కోత దశలో ఉన్న మా వరి పంటకు నీటి అవసరం ఉంది - అధికారులు గుర్తించాలన్న రైతన్నలు.
చిట్వేలి మండల పరిధిలోని ఎల్లమరాజు చెరువు పరిధిలో... సాగు చేసిన వరి పంట 70 శాతం వరకు పూర్తి కాగా... మిగతా 30 శాతం వెన్ను దశకు చేరుకొని నీటి అవసరం చాలాఉందని, ఇంకా ఇరవై రోజుల సమయం పడుతుందని సుమారు 25 మంది రైతులు సుమారు 50 ఎకరాల మేర వరి పంటను సాగు చేసి చివరిదశలో ఉన్నామని; అధికారులు మా అవసరాన్ని గుర్తించాలని వరి పంట సాగు చేసిన కంపసముద్రం రైతులు మూకుమ్మడిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు ఉదయం..వృధాగా పోతున్న నీటిని కాపాడాలని అధికారులు స్పందించాలని కొందరు కొన్ని పత్రికల్లో అడిగిన తీరు అవాస్తవమని; మాలాంటి రైతులకు ఇబ్బంది కలిగిస్తుందని.. అధికారులు మా పంట క్షేత్రాలను సందర్శించి తదుపరి నిర్ణయాలు తీసుకొని రైతన్నలకు దన్నుగా నిలవాలని రైతులు అన్నారు.
Comentários