నకిలీ ఫర్టిలైజర్ ముఠా గుట్టు రట్టు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు కేంద్రంగా నకిలీ ఫర్టిలైజర్, క్రిమి సంహారక మందుల దందా ఎదేచ్చగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం మెరుపు దాడులు చేసి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే 12 రకాల నకిలీ ఫర్టిలైజర్, క్రిమి సంహారక మందులను సీజ్ చేసిన అధికారులు ఏ.డి సురేష్ రెడ్డి, ఏ.ఓ శివశంకర్ రెడ్డి. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణం లోని ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ (పిఎంఎఫ్) కేంద్రంగా హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ క్రిమి సంహారక మందులు ఫర్టిలైజర్ల దందా ఎదేచ్చగా కొనసాగిస్తు, బెంగళూరు హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి ముడి సరుకు కొనుగోళ్లు, కల్తీ చేసిన పలు రకాల ఫర్టిలైజర్లు నకిలీ బ్రాండ్ల పేర్లతో రాయలసీమలోని అన్ని జిల్లాలకు సరఫరా. సోమవారం ఉదయం అధికారులు నిర్వహించిన మెరుపు దాడులలో విస్తు పోయే నిజాలు బయటికి వచ్చిన వైనం. లక్షల్లో విలువ చేసే పలు రకాల ఫర్టిలైజర్లు... ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి కూలీలను రప్పించి ఇక్కడ యదేచ్చగా కల్తీ చేస్తూ, రైతులకు నాసిరకం మందులను సరఫరా చేస్తూ, అటు రైతును ఇటు వ్యాపారులను దగా చేస్తూ, కోట్లలో సాగుతున్న అక్రమ దందా. ఎటువంటి ట్రేడ్ మార్కు, లైసెన్సు లేకుండా గత కొద్ది నెలలుగా యదేచ్చగా కొనసాగుతున్న ఈ దందాకు నేటితో అధికారులు చరమగీతం పాడనున్నారా లేక రైతులను నిట్ట నిలువునా ముంచి దిగుబడి తగ్గించే ఇలాంటి నకిలీ మందుల ఫర్టిలైజర్ల వ్యాపారులను చూసి చూడనట్లు వదిలేస్తారా వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా లాంటి పథకాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేరువై పంటకు కావలసిన అన్ని రకాల సూచనలను సలహాలను ఇస్తూ ఉండగా, ఇలాంటి నకిలీ దందాలకు పాల్పడుతున్న కల్తీ ముఠాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పేరు అప్రతిష్టల పాలవుతోంది.
Comments