top of page
Writer's pictureMD & CEO

తిరుమల కొండపై సినిమా పాటల వివాదం, ఇద్దరు ఉద్యోగులపై వేటు

తిరుమల కొండపై సినిమా పాటల వివాదం, ఇద్దరు ఉద్యోగులపై వేటు

తిరుమల కొండమీద.. శ్రీవారి సన్నిధిలో ఎల్​ఈడీ స్క్రీన్​పై సినిమా పాటలు ప్లే అయిన ఘటనలో అధికారులు సీరియస్​ యాక్షన్​ తీసుకున్నారు. తిరుమల ఆలయంలోని ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ఇతర మూడు చానెల్‌లను ప్రసారం చేసినందుకు గ్రేడ్-1 అసిస్టెంట్ టెక్నీషియన్ పీ రవికుమార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సస్పెండ్ చేసింది. రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా టీటీడీ రేడియో & బ్రాడ్‌కాస్టింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ ఏవీవీ కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల ఆలయం వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై మొన్న శుక్రవారం సినిమా పాటలను ప్లే చేయడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది కఠినమైన నిబంధనలు ఉల్లంఘించినట్టేనని చాలామంది టీటీడీ తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు.


కాగా, ఈ ఘటనపై టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా స్పందించి వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించారు. దీనికి బాధ్యుడిగా రవికుమార్‌పై సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఏవీవీ కృష్ణప్రసాద్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

82 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page