షార్ట్ సర్క్యూట్ తో ఇళ్ళు దగ్ధం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో శనివారం గువ్వల యల్లమ్మ కు చెందిన రేకుల ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమై సుమారు రూ 5 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు యల్లమ్మ తెలియజేశారు. కుమారుడు జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లగా.. తల్లి, కుమార్తెలు సంక్రాంతి సందర్భంగా ఊరెల్లడంతో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని., పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించగానే గ్రామస్తులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పారు. ఈలోపే ఫ్రిడ్జ్, టీవీ, కుక్కర్, మంచం, పరుపు, వంట సామాగ్రి, రూ లక్ష లు నగదు, 4.50 గ్రాములు బంగారు కాలి బూడిదయిందని బాధితురాలు యల్లమ్మ బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ శాఖ వెంటనే స్పందించి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ రాజేష్, వీఆర్వో వెంకటేశ్వర్లు స్వామి, సర్పంచ్ ఈశ్వరయ్య, వెంకటయ్య లు 25 కిలోల బియ్యం, రూ 2 వేలు నగదు తక్షణసాయంగా బాధితురాలికి అందజేశారు.
మాజీ సర్పంచ్ ఆర్థిక సహాయం
అగ్ని ప్రమాదం సంబంధించినట్లు సమాచారం తెలుసుకున్న ఊటుకూరు మాజీ సర్పంచ్ మన్నేరు లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆర్థిక సాయంగా రూ 5 వేలు నగదును బాధితురాలికి అందజేశారు. విద్యుత్తు, గ్యాస్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని., అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రతి ఒక్కరు జాగరూకతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.
Comentarios