చిట్వేలి సబ్ రిజిస్టర్ ఆపీసు లో అగ్నిప్రమాదం.
అన్నమయ్య జిల్లా చిట్వేలి సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చేసుకుంది. బ్యాటరీల విఫలంతో అన్ని గదులకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన అధికారులు సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలు ఆపే ప్రయత్నం చేశారు. కాగా భద్రపరిచిన డాక్యుమెంట్ల గదులలో మంటలు రావడంతో ఎంతవరకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలియాల్సి ఉంది.
మెయిన్ సిస్టం, ఏసి, బ్యాటరీలు ఫర్నిచర్ తో కలుపుకొని సుమారు 5 లక్షల మేర నష్టం వాటిలిందని డాక్యుమెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని రిజిస్టర్ శ్రీనివాసులు తెలియపరిచారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి డ్రై కెమికల్ పౌడర్ ని చెల్లించి జాగ్రత్తలు సూచించారు.
కాగా గడిచిన నెల రోజుల నుంచి రిటర్న్ డాక్యుమెంట్లు అందక కార్యాలయం చుట్టూ తిరుగుతూ విసిగి వేసారుతున్న క్రయ విక్రయ దారులకు ఈ ప్రమాదం మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున అధికారిపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బందుల అభద్రతాభావం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments