అన్నమాచార్యలో అగ్నిమాపక సిబ్బందిచే మాక్ డ్రిల్
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం రాజంపేట అగ్నిమాపక కేంద్రం అధికారి పి.శివశంకర్ రెడ్డి, వారి సిబ్బంది డి.శివయ్య, సత్యరాజు, పీ.రవీంద్రబాబు, శివశంకర్, రాజేష్, చక్రవర్తి, రాజన్నలు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కళాశాలలో ఫైర్ సిస్టమ్ మానిటరింగ్ టీమ్ చేత మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం రాజంపేట అగ్నిమాపక కేంద్రం వారి సహాయంతో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఏదైనా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఏదైనా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మొదటగా భయపడకుండా ధైర్యంగా ఉంటూ ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచించారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది కళశాలలోని సెక్యూరిటికి, సిబ్బందికి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా నివారించాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎం.వి నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ కళాశాలను సందర్శించి విద్యార్థులకు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు కళాశాల యాజమాన్యం అగ్నిమాపక అధికారి శివశంకర్ రెడ్డికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Comentários