స్మశాన వాటిక నాడు ఐదు ఎకరాలు నేడు -అర్ధ ఎకరా..!
నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ పరిధిలో ఉన్న హరిజనవాడ గ్రామానికి చెందిన స్మశాన వాటిక సర్వే నెంబర్ 1 లో 5 ఎకరాలు స్థలం కేటాయించి ఉండేదని, అది నేడు అర్థ ఎకరాకు కుదించకపోయిందని కబ్జాదారులు ఏదేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారని స్థానికులు జాయింట్ కలెక్టర్ మరియు తాసిల్దార్ లకు ఫిర్యాదులు చేయడం జరిగింది. నాయకుల అండదండలతో యదేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతూ ఎదురొచ్చిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వ భూము లను కుల్లగొట్టింది చాలా క స్మశానవాటికల పై కూడా భూకబ్జాదారులు తమ పంజా విసురుతూ ఉండడం ఎంతవరకు న్యాయం అని స్థానికులు అంటున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు గట్టి చర్యలు తీసుకొని కబ్జాదారుల నుండి తమ కొరకు ప్రభుత్వ ఇచ్చిన స్మశాన వాటికను కాపాడాలని ప్రభుత్వాధికారులను కోరడం జరిగింది అని తెలిపారు. ఈ మేరకు తహసిల్దార్ స్పందిస్తూ కబ్జాకు గురి అయినటువంటి స్మశాన వాటిక స్థలాన్ని పూర్తిగా సర్వే చేసి అప్పజెప్పడం జరుగుతుంది అని అన్నారు.
Комментарии