top of page

పండగ పూట ప్రొద్దుటూరులో ఫ్లెక్సిల గోల - సమగ్ర విశ్లేషణాత్మక కధనం

కడప జిల్లా, ప్రొద్దుటూరు లో అర్ధరాత్రి ఫ్లెక్సీల గోల మొదలయింది, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలకు కూడా ఫ్లెక్సీల వివాదం వెంటాడిన మాట వాస్తవమే, ఒకటి వారి అభిమాన నాయకుని ఫోటో ఫ్లెక్సీలో లేదనో లేదా ఇతర పార్టీలకు చెందిన నేతల ఫ్లెక్సీలు చేపటమో లేదా కాల్చి వేయడమూ జరిగేది, ఏది ఏమయినప్పటికీ ఆ అనుచర వర్గాలు వారిని వారు సమర్ధించుకోవటం ఇక్కడ గమనార్హం. అయితే చాలా మంది ప్రజలు ఇది సబబు అనో లేదా తప్పు అనో వారి అభిమానాన్ని లేదా వ్యతిరేకతనో తెలుపుతుంటారు, కానీ కొందరు దీనికి భిన్నంగా సందర్భోచితంగా తగిన వ్యాఖ్యలు చేస్తుంటారు, మరి కొందరు రాజకీయ అనుభవమో లేదా ఎక్కడో వారు తెలుసుకున్న పార్టీ ప్రోటోకాల్ ను అనుసరించి ఏది సందర్భోచితమో ఏది కాదో ఇట్టే చెబుతారు, ఇదంతా ఎందుకు చెబుతున్నాడు ఇతగాడు వివరాల్లోకి వెళ్లకుండా ఏదో 'కట్టే కొట్టే తెచ్చే' అని జరిగిన సంఘటనకు సంబంధించిన ఫోటోనో వీడియోనో పెడితే మేము చూస్తాము కదా అనుకుంటేనే ఈ వార్త చదివే మీకు కూడా కొన్ని విషయాలు తెలియచేయాలని మా తాపత్రయం, గతంలో కూడా ఫ్లెక్సీల వివాదాలు రాష్ట్ర స్థాయిలో చాలా జరిగాయి, అంత ఎందుకు మొన్నటికి మొన్న జమ్మలమడుగులో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి ఫ్లెక్సీ కూడా కొందరు చింపివేయటం జరిగింది అందుకు సంబంధించి ఘటనా స్థలిలో దొరికిన ఆధారాలను బట్టి కొందరు వ్యక్తుల మీద కేసులు నమోదు చేయగా ఒక వర్గం శాంతించింది, ఏది ఏమయినా ఒక వ్యక్తి లేదా ఒక రాజకీయ నాయకుడు పెట్టిన ఫ్లెక్సీ వ్యక్తిగతం అయితే అందులో ఎటువంటి ప్రోటోకాల్ పాటించనవసరం లేదు, పార్టీకి సంబంధించి ఏదయినా కార్యక్రమమో లేదా మీటింగ్ లకు ప్రోటోకాల్ ప్రకారం నాయకుల హోదాలను బట్టి ఫ్లెక్సీలలో వారి ఫోటోలు ప్రచురిస్తారు, ప్రభుత్వ పధకాలు ప్రజలలోకి తీసుకుని వెళ్లే క్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి, కార్యక్రమం జరుగు ప్రాతంలోని స్థానిక నాయకుల ఫోటోలు పెడతారని అదే ప్రభుత్వ నిధులతో చేపట్టిన కార్యక్రమం అయితే అందరి నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలలో వెలుస్తాయి అందుకు చక్కటి ఉదాహరణే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలిలో మునిసిపల్ నిధులతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇందులో 41 వార్డులకు సంబంధించిన మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఫోటోలు వారి క్యాడర్ వార్డులతో సహా ఏర్పాటు చేశారు, తాజాగా ప్రొద్దుటూరు లోని శ్రీరాములపేట నాలుగు రోడ్ల దగ్గర వైసీపీ ఎంమ్మెల్సీ రమేష్ యాదవ్ నెలకొల్పిన ఫ్లెక్సీ వివాదాలకు దారి తీసింది ఇందులో అదే పార్టీకి చెందిన స్థానిక ఎంమ్మెల్యే ఫోటో లేకపోవటమే ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది, ఈ నెల 16వ తేదీన రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీని అర్ధరాత్రి సమయంలో అభిమానులు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఫ్లెక్సీలలో స్థానిక MLA ఫోటో లేకపోవటం వలన ఆగ్రహించిన MLA వర్గీయులు రమేష్ యాదవ్ వర్గానికి చెందిన రఘునాథ్ రెడ్డి పై అమానుషంగా దాడి చేసి గాయ పరిచారు, బాధితుడు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు, తాము అంతా ఒకటే రాజకీయ పార్టీ అని అందరూ వారి నాయుకుడు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోనే ఆ పార్టీ కోసమే పని చేస్తున్నామని అలాంటప్పుడు ఇలా తన మీద దాడి చేసి తీవ్రంగా రక్తగాయాలు అయ్యేలా గాయపరచడం సబబు కాదని, జరిగిన సంఘటనను పట్టణ మూడవ పోలీసు స్టేషన్ నందు పిర్యాదు చేశామని తెలిపారు.


161 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page