మూడు చక్రాల బండి కోసం ముప్పూటలా పోరాటం
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ, అమృత నగర్, నాలుగవ రోడ్డు నందు నివాసముంటున్న షేక్ అష్రఫ్ షేక్ గౌసియా దంపతులకు ఇద్దరు సంతానం, ఇద్దరూ ఆడపిల్లలు కావటం చేత తండ్రి జీవనోపాధి కోసం ఒక ప్రక్క రిక్షా తొక్కుతూ, మరో ప్రక్క ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు అనాధ శవాలను పూడుస్తూ వచ్చిన ఆదాయంతో ఇంటిని నెట్టుకొస్తూ ఉండేవాడు. కాగా పెద్దకూతురు మాబుచాన్ పుట్టుకతోనే పోలియో సొకటంతో ఆ తల్లిదండ్రులకు బాధను మిగిల్చింది. ఇదిలా ఉండగా చిన్న వయసు నుండి మాబూచాన్ ఇటుక బట్టీలలో పనిచేసుకుంటూ జీవనోపాధి కోసం తన తల్లిదండ్రుల ఆర్థిక అవసరాల కోసం రేయి పగలు కష్టపడేది, విధి వక్రంచిందో ఏమో కానీ దేవుడు చిన్నచూపు చూశాడో తెలియదు కానీ ఇటుకుల బట్టిలో పనిచేస్తున్న మాబుచాన్ తనకు పోలియో సోకిన కాలు బట్టిలోని కొలిమిలో పడగా పూర్తిగా కాలిపోయింది.
ఇదిలా ఉండగా ఆర్థిక భారం మీద పడి మాబుచాన్ తన సొంత బావమరిది తో 2009లో వివాహం చేశారు. అంగవైకల్యం వెక్కిరించటంతో సంవత్సరం తిరగకుండానే మాబుచాన్ కు భర్త విడాకులు ఇచ్చాడు. తల్లి గౌసియా నాలుగు ఇళ్లల్లో పని చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోసుకొస్తుండగా, అష్రాఫ్ అనారోగ్యానికి గురై అటు రిక్షా తొక్కు లేక ఇటు ప్రభుత్వం ఆసుపత్రిలో శవాలను పూడ్చనీకి వెళ్లలేక పూర్తి ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వగా, మాబుచాన్ తనకున్న ఒక కాలితో ఇంట్లోనే పేపర్ బ్యాగులు కుట్టటం ప్రారంభించింది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్న మాబుచాన్ కాలుకి మరో మారు చికిత్స చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడగా, తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు కాలును మోకాలి భాగం వరకు పూర్తిగా తొలగించారు.
ప్రతిరోజు తను బ్యాగులు కుట్టటానికి ఆటోలో వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్నందున మరింత డబ్బులు ఖర్చు అవుతున్నాయని, తనకున్న చిన్నపాటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో అరబీ నేర్చుకోవటం ప్రారంభించింది. దగ్గరలోని మదరసాలో అరబీ తరగతుల శిక్షణకు వెళ్లి అటు అరబ్బీ శిక్షణ, ఇటు బ్యాగులు కుట్టటం, ఇంట్లో తల్లిదండ్రులకి భారం కాకూడదని ఆలోచనతో పనిచేస్తూ వస్తుంది. మరో మూడు సంవత్సరాలు మదరసాలో అరబ్బీ శిక్షణ తీసుకుంటే తనకు అదే మదరసాలో ఉద్యోగం వస్తుందని, తమ ఆర్థిక అవసరాలు తీరుతాయని, ఇందుకుగాను ఆటోలకు బాడుగలు చెల్లించలేని తాను తన తల్లిదండ్రులు మూడు చక్రాల బండి దాతలు ఇప్పిస్తే తనకు మేలు చేసిన వారు తన జీవితాన్ని తన కుటుంబ పోషణకు తోడ్పాటు కలిగించిన వారు అవుతారని దీనంగా చేతులు చాచింది... తనకు సహాయం చేయదలచిన వారు తన ఫోన్ పే నెంబర్ 8247211907 లేదా ఫోన్ నందు సంప్రదించి సహాయం చేయవలసిందిగా అర్ధిస్తోంది...
Comments