అటవీ సంపదను రక్షించుకోవాలి - జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
అటవీ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ అన్నారు. ప్రపంచ వైల్డ్ దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అడవి కన్న తల్లి లాంటిదని, అడవిని సురక్షితంగా సంరక్షించుకోవాలని తెలిపారు. అడవికి నిప్పు పెట్టడం వలన వృక్ష సంపదతో పాటు వన్యమృగాలు మృత్యువాత పడతాయని తెలిపారు. అడవులు నశిస్తే మానవ మనుగడకే ప్రమాదమని అన్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి వచ్చిన 21 మంది విద్యార్థులకు ఆయన బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట రేంజ్ అధికారి నారాయణతో పాటు జిల్లాలోని రేంజ్ అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
Comentários