top of page
Writer's picturePRASANNA ANDHRA

ఆదర్శవంతమైన రాజకీయాలకు పునాది గడప గడప - రాచమల్లు

ఆదర్శవంతమైన రాజకీయాలకు

పునాది గడప గడప - రాచమల్లు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

నియోజకవర్గ పరిధిలోని సోములవారిపల్లె పంచాయతి పెన్నా నగర్ నందు సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు, పధకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని ప్రజలను ప్రశ్నించారు, పధకాల అమలులో లోటుపాట్లను ప్రజలకు వివరించి, తక్షణం పరిష్కార దిశగా అడుగులు వేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. నేటితో సోములవారిపల్లె పంచాయతీలో గడప గడప కార్యక్రమం ముగిసిందని ప్రకటించారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత తొంబై నాలుగు రోజులుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, సోములవారిపల్లె పంచాయతీలో పదిహేను రోజులుగా కార్యక్రమం నిర్వహించి దాదాపు ఆరు వేల గడపలను సందర్శించి ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నూ, సమస్యలు అడిగి తెలుసుకున్నామని, గతంలో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం గడప గడప కార్యక్రమం నిర్వహిస్తోందని, గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలతో మమేకమై, వారి సమస్యలకు హామీలు గుప్పించేవారని, కానీ నేడు ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నపటికీ ప్రభుత్వం తరపున ప్రజలకు అందిన లబ్ధిని తెలుసుకుంటూ, సమస్యలపై ద్రుష్టి సారిస్తూ ప్రతి గడపను సందర్శిస్తూ, లోటుపాట్లను సరిచేస్తూ జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాబోవు రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో మరింత ముందుకు దూసుకుపోతామని, పరిపాలనలో లోపాలను ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నామని, దాదాపు తొంబై అయిదు శాతం హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని, ఆదర్శమైన రాజకీయాలకు పునాదిగా ఈ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు. కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పధకాలు అమలు చ్చేస్తున్నామని, ప్రజలు వారికి వచ్చిన పధకాలతో సంతోషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తమ వైసీపీ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నారని, ఇది జగన్ ప్రభుత్వం వలనే సాధ్యం అయ్యిందని, సాంకేతిక లోపాల కారణంగా ఒకరిద్దరికి పధకాల అమలులో ఇబ్బందులు ఎదురైనా మాట వాస్తవమేనని, వాటిపై సచివాలయ సిబ్బంది వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారని అన్నారు.

పక్షపాత ధోరణి విడనాడి తమ ప్రభుత్వం పధకాలను అమలు చేస్తోందని అందుకు కారణం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్ధిక భరోసానిస్తూ వారి క్షేమాన్ని ఆనందాన్ని ఆకాంక్షించి తీసుకున్న చేర్యాలేనని అభిప్రాయం పడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా సంక్షేమ పధకాలు అమలు అవుతున్నాయని నిస్పక్షపాతంగా పధకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని, ప్రజల ప్రేమా అభిమానం చేత తాను జన ప్రేరణ చేత తనకు ఇప్పటివరకు ఒక్క చేదు అనుభవం కూడా ఎదురవలేదని, నాటి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలే ఇప్పటికి సమస్యలుగా మారాయని అన్నారు.


ఈ కార్యక్రమంలో సోములవారిపల్లి ఉప సర్పంచ్ రామకృష్ణారెడ్డి, భావన సహకార సంఘం చైర్మన్ గోపిరెడ్డి రమణయ్య, ఎంపిటిసిలు నరసింహులు, గోటూరు వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ యాలం శంకర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, ఇర్ఫాన్ భాష, యాల్లాల మహమ్మద్ గౌస్, కోనేటి సునంద, గరిశపాటి లక్ష్మీదేవి, నాయకులు అక్బర్, రాయపరెడ్డి, కంభం పాములేటి, రాగా నరసింహారావు, రజక సంఘం అధ్యక్షుడు వన్నెటి కాశయ్య, సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

48 views0 comments

Commentaires

Noté 0 étoile sur 5.
Pas encore de note

Ajouter une note
bottom of page