జెర్సీ ఆవుకు ఓకే కాన్పులో జన్మించిన నాలుగు దూడలు. ఇది అరుదైన సంఘటన, వెల్లడించిన మండల పశు వైద్యులు భాను ప్రసాద్.
ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు జరిగే అరుదైన సంఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఓ రైతు కమతంలో జరిగింది. జొన్నాడకు చెందిన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి కమతం (గోశాల)లో గల ఓ జెర్సీ ఆవుకు అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలో 9 నెలల క్రితం పశు వైద్యుడు భాను ప్రసాద్ యదకు సంబంధించిన ఇండిక్షన్ ఆవుకు ఇవ్వడంతో 9 నెలల అనంతరం ఆ ఆవు రెండు గిత్త దూడలు (మగ), రెండు పెయ్యి దూడల (ఆడ) లకు జన్మనిచ్చిందని, ఆ దూడలు జన్మించిన వెంటనే ఒక గిత్త దూడ బ్రతికి ఉండగా మిగిలిన మూడు దూడలు చనిపోయినట్లు తెలిపారు. ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంటుందని వైద్యుడు వెల్లడించారు. కాగా బ్రతికి ఉన్న గిత్త దూడ ఆరోగ్యకరంగా ఉందని ఆయన తెలిపారు.
Comments