నాలుగు కేజీల గంజాయి స్వాధీనం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించవలసిన విద్యార్థులు పెడత్రోవ పట్టారు. జెల్సాలకు అలవాటుపడ్డారో లేక అక్రమార్జన ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నారో తెలియదు కానీ వైజాగ్ లో చదువుతున్న కడప జిల్లా ఎర్రగుంట్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా పూతరేకుల మాటున గంజాయి సరఫరా చేస్తూ పట్టణంలోని గౌరమ్మ కట్ట వీధి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న రెండవ పట్టణ పోలీసులకు నాలుగు కేజీల గంజాయితో పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పి భక్తవత్సలం పై వివరాలు వెల్లడించారు. ముద్దాయిల నుండి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు వెల్లడించారు. గంజాయి సీజ్ చేసి ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన రెండో పట్టణ సీఐ యుగంధర్, ఎస్సై ధనుంజయుడు, స్టేషన్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఆయన హితువు పలికారు.
Comentarios