ఉచిత పశువైద్య శిబిరాన్ని విరివిగా ఉపయోగించుకున్న పాడి రైతులు.
.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలపరిధి లోని దొగ్గలపాడు(రామాపురం)లో జెర్సీ డైరీ జోనల్ మేనేజర్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో... ఈరోజు ఉదయం పశువైద్యశిబిరం నిర్వహించారు.
కాగా చిట్వేలి పశువైద్య సంచాలకులు కె.డి.వరప్రసాద్,చిట్వేలి పశువైద్యకారిని భువనేశ్వరి లు ఈ వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. తదుపరి ఆ గ్రామ పాడి రైతులకు మినరల్ మీచ్చర్ ను పంపినిచేశారు.అనంతరం 20 ధూడలకు ఎలికపాముల నివారణ మందు,25 గేదెలకు నట్టలనివారణ మందు ను పంపిణీ చేసి; 30 పశువులకు చూడి పరిక్షలు నిర్వహించారు. 20 పశువులకు సాధారణ చికిత్సలుచేశారు. పాడి పోషన తో రైతన్నలకు బహుళ ప్రయోజనం కలుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో డైరీ ఇంచార్జి పవనకుమార్,సూపరవైజర్ సుబ్బరాజు,గోపాలమిత్రలు నరసింహులు, వెంకటసుబ్బయ్య మరియు పాడిరైతులు పాల్గొన్నారు.
Comentários