ఉచిత సివిల్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు
వైయస్సార్ జిల్లా (అక్టోబర్ 29) ఆర్థిక స్తోమత లేని పొద్దుటూరు గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థినిలకు ఉచిత సివిల్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి పేర్కొన్నారు. సోమవారము స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఆధ్వర్యంలో లక్ష్మయ్య అకాడమీ చైర్మన్ 25 మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల వ్యయంతో ఉచిత సివిల్ శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన క్రమంలో ప్రొద్దుటూరులో కూడా సివిల్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగిందన్నారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ఇంకా కొంతమంది సహకారంతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. నవంబర్ 3న కామిశెట్టి సుబ్బారావు డిగ్రీ కళాశాల నందు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో 25 మంది విద్యార్థినీ విద్యార్థులకు కోచింగ్ ఇప్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పేద, మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓంటేరుశ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ప్రతిభ కలిగి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ కోచింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని డిగ్రీ ఆపై చదివినారందరూ అర్హులన్నారు. సివిల్స్ శిక్షణ పొంది మన ప్రాంత విద్యార్థునిలు ఐఏఎస్ కావాలని ఆకాంక్షించారు. టిడిపి నాయకుడు నంద్యాల కొండారెడ్డికి ఈ ఆలోచన రావడం ఈ ప్రాంత విద్యార్థినీల అదృష్టం అన్నారు. వివరాల కోసం 9885609999ను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Bình luận