ఎక్సిబిషన్ లోకి ఉచిత ప్రవేశం
రాచమల్లు వరాల జల్లు
పేద, దిగువ మధ్యతరగతి ప్రజల హర్షధ్వనులు
ఇకపై ప్రత్తి దశరాకు ఫ్రీ ఎంట్రన్స్
ప్రజలపై భారం మోపటం నాకు ఇష్టం లేదు
జులాయిలకు ఎమ్మెల్యే వార్నింగ్
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ఉదయం మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ముందుగా ప్రజలకు దశారా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ నెల 26వ తేదీ సోమవారం నుండి అనిబిసెంట్ మునిసిపల్ గ్రౌండ్స్ నందు ప్రారంభం కానున్న ఎక్సిబిషన్ ఎంట్రన్స్ టికెట్ పూర్తిగా ఎక్సిబిషన్ నిర్వహించినన్ని రోజులు ఉచితం అంటూ నియోజకవర్గ ప్రజలకు తీపి వార్తను ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశరా ఉత్సవాలకు రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో దశరా ఉత్సవాలను ఆర్యవైశ్యులు అత్యంత వైభవంగా జరుపుతారని, అందులో భాగంగా పిల్లలు, పెద్దలకు వినోదాన్ని అందించే ఎక్సిబిషన్ పలు దశాబ్దాల నుండి నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని, మునిసిపల్ ఆదాయాన్ని పెంచటం కొరకు ప్రతి సంవత్సరం ఎక్సిబిషన్ వేలంపాట నిర్వహింస్తుండగా, ఈ సంవత్సరం దాదాపు ఒక్క కోటి నలబై రెండు లక్షలకు గుత్తేదారుడు వేలంపాట దక్కించుకోగా, గడచిన సంవత్సరాలలో అధిక ధరలకు ఎక్సిబిషన్ ఎంట్రన్స్ టిక్కెట్లను అమ్మి లాభార్జన గడించి, ప్రజలపై పెను భారం మోపారని, కానీ ఈ సంవత్సరం గుత్తేదారునితో తానే స్వయంగా మాట్లాడి, మునిసిపాలిటీకి చెల్లించవలసిన డబ్బును తానే చెల్లించి, ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నానని తెలిపారు. ఆకతాయి చేష్టలకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీసు యంత్రాగాన్ని పురమాయించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చెర్యలు తీసుకుంటామని తెలియచేసారు.
Comentários