top of page
Writer's pictureDORA SWAMY

మా కంటికి వెలుగు ముక్కారూపానందరెడ్డి ఫౌండేషన్ - భాదితులు.


మా కంటికి వెలుగు... ముక్కారూపానందరెడ్డి ఫౌండేషన్. అన్న భాదితులు.


అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఆదివారం ముక్కారూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 200 మందికి అందత్వ సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్లు నిర్వహించడానికి శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ లో ఫౌండేషన్ ముక్కారూపానంద రెడ్డి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఆపరేషన్లు చేయించుకున్న అనంతరం వారిని ప్రత్యేక బస్సులో రైల్వే కోడూరు పట్టణానికి తీసుకురాగా భాదితులు మాట్లాడుతూ..


మాకు ఎన్నో రోజులుగా కంటి సమస్యలున్ననూ వాటిని మా యొక్క కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేనందువలన చూపించుకోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో శ్రీ ముక్కారూపానంద రెడ్డి ఫౌండేషన్ వారు ఉచిత కంటి వైద్యం నిర్వహిస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లగా మాకు అన్ని సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేయించి మా ఇళ్లకు పంపించడం చాలా సంతోషంగా ఉందని,మా చీకటి జీవితంలో వెలుగు నింపిన ముక్కారూపానంద రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అలాగే వారి కుమారుడు ముక్కాసాయివికాస్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని వారు ఎంతో ఆనందంతో వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరవ శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

55 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page