ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..ఈ నెల
20న చిట్వేలి లో ఉచిత నేత్ర వైద్య శిబిరం.
ధనాన్ని కలిగి ఉండడం గొప్పకాదు. తాను సంపాదిస్తున్న ధనంలో కొంతమేర ఆపదలో ఉన్నవారికి, దేవాలయాల నిర్మాణానికి, కంటి వైద్యం కోసం ఇలా పలు సేవా కార్యక్రమాలను "ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్" ద్వారా నిరంతరం నిర్వహిస్తూ.. రైల్వే కోడూరు,రాజంపేట నియోజకవర్గాల పరిధిలోనీ ప్రజల మనసులో తమకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న గొప్ప వ్యక్తులు ముక్కా రూపానంద రెడ్డి, అతని కుమారుడు సాయి వికాస్ రెడ్డి.
ఈనెల 20వ తేదీన ఆదివారం నాడు చిట్వేలి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల నందు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు (మధురై శాఖ) తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి మరియు అన్నమయ్య జిల్లా అందత్వ నివారణ శాఖ వారి సహకారంతో "ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్"ద్వారా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏర్పాట్లను పరిశీలించినందుకు విచ్చేసిన ఫౌండేషన్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తెలియపరిచారు.
రూపానంద రెడ్డి, స్థానిక వైసిపినాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. మండల పరిధిలోని కంటి చూపు ఇబ్బందులు గల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఆపరేషన్ అవసరమైన వారికి వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి చిట్వేలికి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. కంటి మందులు,అద్దాలు అవసరమైన వారికి తక్షణమే ఉచితంగా ఇవ్వబడతాయని అన్నారు." మానవసేవే మాధవసేవ" అన్న తలంపుతో ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభిస్తూ ఉందని, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు,యువత పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని,అట్టివారందరికీ రూపానంద రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. మండల వైసీపీ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, బత్తిన వేణు గోపాల్ రెడ్డి, తల్లెం.రమణారెడ్డి,తల్లెం. చంద్రమోహన్ రెడ్డి, తల్లెం.విష్ణువర్ధన్ రెడ్డి,ఉప ఎంపిపి సుబ్రమణ్యం రెడ్డి, సర్పంచ్ బాలు, సుబ్రహ్మణ్యం, కంచర్ల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comentarios