ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.
--కంటి శుక్ల ఆపరేషన్లకు 30 మంది ఎంపిక.
--150 మందికి పైగా ఉచిత వైద్య సేవలు.
కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య.
చిట్వేలు గ్రామ పరిధిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాల చౌడవరం రఘురామి రెడ్డి విద్యా ప్రాంగణం నందు సోమవారం ఉదయం తిరుపతి రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు పాఠశాల కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య తెలియపరిచారు.
మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి పలు రకాల అనారోగ్య బాధితులు ఈ శిబిరానికి విచ్చేసి వైద్యుల సలహాలు సూచనలు మరియు మందులను ఉచితంగా పొందినట్లు రెడ్డయ్య అన్నారు. షుగరు, బిపి, ఈసీజీ తదితర ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించామని మధ్యాహ్నం సమయానికి సుమారు 150 మందికి పైగా ఉచిత వైద్య సేవలను పొందారన్నారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ మరియు ఆర్థో డాక్టర్ లు వైద్య సేవలు అందించారని తాను తెలపారు.ఆదివారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 30 మంది కంటి శుక్లాల ఆపరేషన్లకు తిరుపతికి సురేంద్ర ఆసుపత్రికి పంపినట్లు రెడ్డయ్య తెలిపారు.
ఇరు మండలాలలో మంచి విద్యను అందించడంతోపాటు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో విరివిగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలను అందించడం గొప్ప విషయం అని తోడ్పాటు అందిస్తున్న తిరుమల విశ్వనాథం కు, తిరుమల రెడ్డయ్యకు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Opmerkingen