కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఏపీలో రోజురోజుకు భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ప్రజలకు మాస్క్ యొక్క ఆవశ్యకత తెలియచేశారు, మాస్క్ ధరించని వారికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేసి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వొంతు కృషి చేస్తున్నారు, ప్రజలు కూడా ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ తప్పని సరిగా వెంట తెచ్చుకొని మాస్కును ధరించాలని లేని పక్షంలో కరోనా భారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలియచేశారు, అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1257 కరోనా కేసులు నమోదు కాగా చిత్తూరు, విశాఖ, అనంతపురం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి, వివరాల్లోకి వెళితే చిత్తూరులో 254, విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103, తూర్పుగోదావరిలో 93, విజయనగరంలో 83 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రజలు మాస్క్ ధరించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది అని ఈ సంధర్భంగా వారు హితువు పలికారు.
Opmerkingen