సర్పంచ్ బాలు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సలహా శిబిరం.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తిమ్మాయపాలెం సర్పంచ్ తుపాకుల బాలు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గట్టుమీద పల్లి నందు నెల్లూరు జిల్లా నారాయణ హాస్పిటల్ వారి సహకారంతో ఎముకలు, సాధారణ తదితర వ్యాధులకు ఉచిత వైద్య సలహా శిబిరాన్ని నిర్వహించగా గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని విరివిగా ఉపయోగించుకున్నారు.
నిర్వాహకులు సర్పంచ్ బాలు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సుమారు వందమందికి పైగా ఉపయోగించుకున్నారని వారిలో అవసరమైన వారికి నారాయణ ఆసుపత్రిలో ఉచిత వైద్యాన్ని అందిస్తామని డాక్టర్లు కొంతమందికి సిఫార్సు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎముకల డాక్టర్ అబిద్, జనరల్ మెడిసిన్ డాక్టర్ లితేష్, జనరల్ సర్జన్ డాక్టర్ భాగ్యలక్ష్మి పిఆర్ఓ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
Comments