వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డి సారథ్యంలో, నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వ్యంలో ఉచిత సలహా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
నారాయణ హాస్పిటల్ నుండి పలువు ప్రత్యేక వైద్యులు ఈ వైద్య శిబిరానికి రాగా, కామనూరు గ్రామ ప్రజలు, చుట్టుపక్క పల్లెల ప్రజలు, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో శిబిరానికి వచ్చి వారి ఆరోగ్య సమస్యలను వైద్యులు వివరించి తగు సలహాలు సూచనలతో పాటు, మందులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ముందుగా నారాయణ ఆసుపత్రి వారికి, వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. తమ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉచిత సలహా వైద్య శిబిరం ఏర్పాటు చేయటం వలన తమ గ్రామ ప్రజలకు చుట్టు ప్రక్కల గ్రామాల పల్లెల వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అని అభిప్రాయ పడ్డారు. ఇ.ఎన్. టి, కంటి, గైనకాలజస్టు, ఆర్తో, ఆప్తమాలజి, జనరల్ మెడిసిన్ ఇలా పలువురు వైద్యులు శిబిరానికి వచ్చినందున ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి సలహాలు సూచనలు పొందాలని కోరారు.
లింగాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి దాదాపు లక్షా యాభై వేల రూపాయలు విలువ చేసే మందులను ఉచితంగా ఇవ్వటం జరిగిందని అన్నారు, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా వైద్య శిబిరానికి దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు ఇక్కడి నిర్వాహకులు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు, పలువురు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments