రేడియో స్టేషన్ లో ప్రసంగించిన ఫ్యూచర్ మైండ్స్ విద్యార్థులు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
స్ధానిక ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల విద్యార్థులు శనివారం అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన 89.6 కనెక్టివిటీ రేడియో ను సందర్శించి వివిధ అంశాలపై రేడియో లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు జీవన విధానం అనే అంశంపై పలు సూచనలు ఇవ్వగా విద్యార్థులు ఆసక్తికరంగా విని తాము చెప్పినట్లు నడుచుకుంటామని తెలిపారు.
అనంతరం రేడియో స్టేషన్ మేనేజర్ డాక్టర్ కాశి ప్రసాద్ రేడియో విశిష్టత గురించి తెలిపి అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతికత గురించి తెలిపారు. విద్యార్ధుల ప్రసంగాలను వీక్షించి మెళుకువలు తెలిపారు. ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల యాజమాన్యం నంద కిషోర్ మాట్లాడుతూ రాజంపేటలో రేడియో స్టేషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని.. రేడియో లో ప్రసంగించే అవకాశం తమ పాఠశాల విద్యార్థులకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామాంజులు, సుజిత, చైతన్య, ఖలేషా, శివ శంకర్ లు పాల్గొన్నారు.
תגובות