అక్రమ గంజాయి విక్రేతలు అరెస్టు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
ప్రొద్దుటూరు లో అక్రమ గంజాయి విక్రేతలను అరెస్టు చేసి, వారి నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక నారాయణ స్కూల్ వద్ద గంజాయి విక్రేతలు ఉన్నారని, తమకు రాబడిన సమాచారం మేరకు, టూ టౌన్ సిఐ ఇబ్రహీం, ఎస్ఈబి ఇన్స్ పెక్టర్ మోహన్ రెడ్డి, సిబ్బంది తో వెళ్లి వారిని పట్టుకున్నారని. అందులో మొదటి వ్యక్తి అయిన విశాఖ జిల్లా రోలుగుంట మండలానికి చెందిన జిగిరెడ్డి గౌరి నాయుడు అను వ్యక్తిని విచారించగా గడచిన ఐదేళ్ల నుండి గంజాయి విక్రిస్తున్నట్లు, అతనిపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. గౌరి నాయుడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడని ఖాజీపేట మండలానికి చెందిన రమేష్ అను వ్యక్తి తెలుసుకొని గంజాయి తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్నాడని, జమ్మలమడుగుకు చెందిన లాలు, రమేష్ దగ్గరికి వచ్చి గంజాయి కావాలని అడుగగా, గౌరి నాయుడు గంజాయి తీసుకొని ప్రొద్దుటూరుకు వస్తున్నాడని లాలూను రమ్మని చెప్పగా, వారికి గౌరి నాయుడు గంజాయి ఇవ్వగా అంతట ముగ్గురిని పట్టుకొని వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలు అలవాటు చేసుకుని జీవితం నాశనం చేసుకోరాదని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రేతలను పట్టుకున్న టూ టౌన్ ఎస్సై రెడ్డి సురేష్, సిబ్బంది బాబాఫకృద్దీన్, మల్లికార్జున లను ఎఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ అభినందించారు.
Comments