పేదల పక్షం వైసీపీ ప్రభుత్వం - రాచమల్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సెప్టెంబర్ 13
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి కులమతాలకు అతీతంగా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని ముందంజలో నడిపించి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నది ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని పెన్నా నగర్ లో మంగళవారం సాయంత్రం సాయంత్రం సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడప గడపకు తిరిగిన ఎమ్మెల్యే గత మూడేళ్లలో ప్రభుత్వం వలన లబ్ధిదారులకు లభించిన లబ్ధిని వివరించారు. ఎమ్మెల్యే రాచమల్లు వార్డులో మహిళలను జగనన్న ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని అడిగి తెలుసుకున్నారు, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. 'గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఏ ప్రభుత్వంలోనైనా మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి లక్ష, రెండు, మూడు లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా?' అని ఎమ్మెల్యే ఆడగగా గతంలో ఎప్పుడూ మా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేసిన ప్రభుత్వాన్ని చూడలేదని మహిళలు పేర్కొన్నారు. పేదలకు సాయం చేయాలి, అండగా నిలబడాలనే పెద్ద మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కితాబిచ్చారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మరోమారు రాష్ట్రాన్ని పాలించాలని, అందుకు ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, సోములవారిపల్లి సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఉప సర్పంచ్ మార్తల కృష్ణారెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు కామిశెట్టి బాబు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, షేక్ కమల్ భాష, యాల్లాల మహమ్మద్ గౌస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ యాలం శంకర్ యాదవ్, ఎంపీటీసీ గోటూరు వెంకటేష్, సహకార బ్యాంక్ చైర్మన్ రమణ, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజిని, రాగా నరసింహారావు, వైసిపి నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి, బండారు సూర్యనారాయణ, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comentários