వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం సాయంత్రం 8వ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పన, కాలువలు, మంచినీటి సరఫరా వంటి సమస్యలపై వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పధకాల అమలు తీరు తెన్నూ సచివాలయ సిబ్బంది, వార్డులోని ప్రజలు తెలుపగా, పధకాల పారదర్శకత వారికి వివరించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భవతులకు అందవలసిన పౌష్ఠిక ఆహారం, పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పాలు, గ్రుడ్డు, బాలామృతం వంటివి సకాలంలో అందజేస్తున్నారా లేదా అని అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 9వ సచివాలయం సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ మహిళా పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు గుఱ్ఱం లావణ్య, వరికూట ఓబుల్ రెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్టా బాలాజీ, అనిల్ కుమార్, షేక్ కమల్ భాష, జిలాన్, రాగా నరసింహారావు, వైసిపి నాయకులు 40 ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments