గ్రామాల అభివృద్ధి జగన్ లక్ష్యం - ఎమ్మెల్యే రాచమల్లు
పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గోపవరం పంచాయతీలోని ఆచారి కాలనీలో గంజికుంట శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరిగి వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్ని తమకు సకాలంలో అందాయని ప్రజలు చెప్పడంతో ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు. నిరుపేద అనేవారే లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని సంకల్పంతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు గృహాలను అందజేశారని ఆయన తెలిపారు గ్రామాల అభివృద్ధి జగన్మోహన్ లక్ష్యమని, ప్రతి ఒక్క గ్రామానికి ఆన్ని వసతులు ఉండాలని స్కూలు, అంగన్వాడి స్కూల్, హాస్పిటల్ అన్ని వసతులతో గ్రామాల అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ గద్దే మోష. ఉప సర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, ఎంపీటీసీ ఓబయ్య ,భూసం రవి, రఘునాథరెడ్డి, గౌస్, రఘు, రమణ, సాయి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఏ గుర్రప్ప, భాష ,వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు భూమి రెడ్డి వంశీదర్ రెడ్డి, పిట్ట బాలాజీ, వైసీపీ నాయకులు,దేసు రామ్మోహన్ రెడ్డి ,స్వప్న పెయింట్స్ సురేష్ ,సచివాలయం సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు కార్యకర్తలు వార్డ్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
תגובות