గడప గడపలో సత్వర సమస్యల పరిష్కారం
ప్రొద్దుటూరు సెప్టెంబర్ 20 ప్రసన్న ఆంధ్ర
సమస్యల పరిష్కారం కోసమే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 38వ వార్డు కౌన్సిలర్ పల్లా రమాదేవి వార్డు ఇంచార్జ్ పల్లా సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమస్యలపై ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పెన్షన్లు, డ్రైనేజీ, రోడ్డు, జగనన్న ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారికి అర్హత కలిగి ఉన్న కొందరికి రాలేదని ఎమ్మెల్యేలు ప్రజలు కోరారు. ఈ సందర్భంగా వార్డులో వెంకట లక్ష్మమ్మ అనే మహిళకు మూడు నెలల నుంచి పెన్షన్ రాలేదని ఎమ్మెల్యేను అడగగా వెంటనే అధికారులను పిలిపించి ఆమెకు పెన్షన్ అందజేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్ట బాలాజీ, అనిల్ కుమార్, యాల్లాల మహమ్మద్ గౌస్, షేక్ కమల్ భాష, గరిశపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ భాష, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని, రాగా నరసింహారావు, టీటీడీ పాలకమండలి సభ్యులు మారుతి ప్రసాద్, వైసిపి నాయకులు 40 ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, అగ్గరపు శ్రీనివాసులు, రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comentarios