వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
సంక్షేమ పథకాల అమలు, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జగన్ సర్కార్ ముందుకు దూసుకుపోతుందని, గత మూడు సంవత్సరాలుగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు వేల కోట్ల రూపాయలు వారి వారి అకౌంట్లో జమ చేశామని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పదవ వార్డు కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండవ రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి నగర్ లోని ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని, పథకాల అమలులో పారిదర్శకత వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. వాజ్పేయి నగర్ లోని ఆక్రమిత స్థలాలు ఈనెల 15వ తేదీ లోగా ఖాళీ చేయమని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు శనివారం నాడు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లును కలిసి వారి గోడు వెళ్ళబుచుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు వారికి భరోసానిచ్చారు.
అనంతరం పదో అవార్డు లోని కాన్పుల ఆసుపత్రి కూడలి వద్ద గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మమేకమైన ఆయన సంక్షేమ పథకాల అమలు తీరు తెన్ను వార్డులోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలలో పారదర్శకతతో వ్యవహరిస్తుందని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని ఆయన గుర్తు చేశారు. అనంతరం వార్డులోని శివ అనే వ్యక్తి పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమై ఉన్న ఆయనను ఎమ్మెల్యే రాచమల్లు గమనించి, అతని స్థితిగతులు, వాస్తవ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు కంటతడి పెట్టిన శివ రాచమల్లును ఆర్థిక సాయం చేయమని కోరగా, భావోద్వేగంతో స్పందించిన ఆయన మానవతా దృక్పథంతో అక్కడికక్కడే 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి వెనువెంటనే అతనికి అందజేశారు.
For full video click_here
Comments