గడపగడపలో ఎమ్మెల్యే కొరముట్ల.
--అడుగడుగునా లబ్ధిదారుల ఆనందం.
--పత్తి గుంట వారి పల్లె లో సిసి రోడ్డు నిర్మించాలని సర్పంచ్ కి సూచన.
అర్హులకు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల వివరణను తెలుసుకునేందుకు చిట్వేలి మండల పరిధిలోని పోలోపల్లి మాలే మార్పురం గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తొలుతగా
అనారోగ్యంతో బాధపడుతున్న ఎం.గొల్లపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు కొమ్మిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి(చిన్నపరెడ్డి) ని ఈరోజు ఉదయం ఆయన స్వగృహం నందు కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
తదుపరి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలోపల్లి గ్రామ సచివాలయం పరిధిలో సర్పంచ్ సంగరాజు వెంకటసుబ్బమ్మ,ఎంపీటీసీ కృష్ణయ్యల ఆధ్వర్యంలో బోయపల్లి అరుంధతి వాడ, హరిజనవాడ,పోలోపల్లి అరుంధతి వాడ గ్రామాలలో పర్యటించారు. కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరిస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చించారు. పత్తిగుంట వారి పల్లె గ్రామం నందు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన యంత్రాలతో చర్యలు చేపట్టి, సిమెంటు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని గ్రామ సర్పంచ్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఎంపీపీ చంద్ర, వైసిపి నాయకులు చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, మాజీ సర్పంచ్ పిచ్చిరెడ్డి, ప్రభాకర్,మైనార్టీ నాయకులు గులాం భాషా, మధుసూదన్ రాజు, దేవరాజు, ఈశ్వరయ్య, చంద్రశేఖర రాజు, సుధాకర్, నాగేశ్వర,సర్పంచులు, ఎంపిటిసిలు, ఎమ్మార్వో మురళీకృష్ణ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. .
Comments