ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు
గడప గడప లో ప్రభుత్వ విప్ కొరముట్ల.
--నాడు పథకాల కోసం పడిగాపులు నేడు మీ ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు - అందరి ముఖంలో ఆనందం- చెర్లోపల్లి లో రాత్రి వరకు కొనసాగిన ఈ కార్యక్రమం.
గడప గడపకు మన ప్రభుత్వం"కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం చిట్వేల్ మండలం రాజుకుంట గ్రామం అశోక్ నగర్ ఎస్టి కాలనీ, అనుంపల్లి, చెర్లోపల్లి నందు పాల్గొనడానికి విచ్చేసిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కు స్థానిక వైసీపీ నాయకులు ఎం.కనకరాజు, ఎం చిన్నా రాయల్, ఎం లోకేష్, చెర్లోపల్లి సర్పంచ్ ఈశ్వరయ్యల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే కొరముట్ల అమ్మ అక్క అన్న తమ్ముడు బాగున్నారా.. అంటూ పేరుపేరునా పలకరిస్తూ ప్రతి ఇంటి గడప లోకి వెళుతూ ప్రభుత్వం నుంచి ఆయా కుటుంబాలకు అందుతున్న పథకాల పై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి ఇబ్బందులను తీర్చాలని అధికారులకు ఆదేశిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మీ ముందుకు వచ్చిన మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని మీ సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పని చేస్తుందని మీ అందరి దీవెనలు మాపై ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని రానున్న సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీ ఇవ్వాలని అందరిని కోరారు.ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల నుండి సలహాలు,అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసులు రెడ్డి, ఎల్వి మోహన్ రెడ్డి, చౌడవరం ఉమా మహేశ్వర్ రెడ్డి, యన్నారు కిషోర్ కుమార్, లింగం లక్ష్మికర్,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, ఎంపీపీ చంద్ర, రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరాజు, చిట్వేలు మండల యూత్ కన్వీనర్ నవీన్, మాది నేని మల్లికార్జున మోచర్ల నరిసింహులు, మండల రెవెన్యూ అధికారి సత్యానందం, ఆర్ ఐ సునీల్, మండల ఎస్సై వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు,అన్ని శాఖలఅధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments