"గడపగడప కు మన ప్రభుత్వంలో" భాగంగా నేతివారి పల్లిలో పర్యటించిన కొరముట్ల.
---సంతోషం వ్యక్తపరిచిన లబ్ధిదారులు.
మునుపెన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా పథకాలు సకాలంలో అందుకుంటూ లబ్ధి పొందుతున్నారని...ఈ రోజున"గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నేతివారిపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని అరుంధతి వాడ,హరిజనవాడ, ఎస్టి కాలనీ లలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.
ప్రతి ఇంటిలోనూ సంక్షేమ పథకాల పైన ప్రభుత్వ పాలన పైన లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తపరిచారు.తదుపరి స్థానిక నాయకులు ప్రతినిధులతో కలిసి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ఎవరికైనా అర్హత ఉండి కూడా వైయస్సార్ రైతు భరోసా, పెన్షన్లు, వైయస్సార్ ఆసరా, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వైయస్సార్ కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరానట్లయితే అట్టి వారందరికీ వెనువెంటనే లబ్ధి చేకూరాలని అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందికి మరియు అధికారులకు శాసనసభ్యులు కొరముట్ల సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ గుండయ్య యాదవ్, ఉప సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి పిచ్చిరెడ్డి,రాజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం లక్ష్మీకర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments