గడప గడపకు రాచమల్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ్వం కార్యక్రమం గడచిన 64 రోజుల నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎండా వానను సైతం లెక్క చేయని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మొక్కవోని దీక్షతో బలమైన సంకల్పం చేత పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బలమైన అనుచరవర్గం కార్యాచరణ చేయగల సమర్ధవంతమైన నాయకత్వం, మునుపెన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దూసుకుపోతున్న తీరు ఇటు నియోజకవర్గంలోను, అటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చెర్చనీయాంశంగా మారటం ఒక అంశం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అతనికి గుర్తింపు గౌరవం తెచ్చిపెట్టింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావటం చేత అటు ప్రతిపక్షాలకు, ఇటు వామపక్షాలకు ఇక్కడి రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది, ప్రతిపక్షాల విమర్శలను ప్రతివిమర్శను తిప్పికొడుతూ రాబోవు ఎన్నికల్లో మునపటి మెజారిటీని అధిగమిస్తారా లేదా అన్నది కొందరి ప్రశ్న కాగా, నియ్యోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు తీరే తమ ఓటు శాతం పెంచుతుంది అని అంటున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు మూడవ రోజున 30వ ఎలెక్షన్ వార్డు, 39వ సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా వార్డులోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడారు, సచివాలయ పరిధిలో సంక్షేమ పధకాల తీరుతెన్నూ స్వయానా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 30 వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి మీగడ దీప్తి చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, వైఎస్ఆర్సిపి నాయకుడు నాగార్జున రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైయస్సార్సీపి మహిళ నాయకురాళ్ళు, సచివాలయ సిబ్బంది 30 వార్డు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments