చిట్వేలి ఎన్సిసి విద్యార్థులచే ఘనంగా 154వ గాంధీ జయంతి.
30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి కమాండింగ్ అధికారి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో 154 వ గాంధీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి ఎన్సిసి విద్యార్థులచే ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన సత్యం, అహింస ప్రపంచంలో గొప్ప ఆయుధాలని వాటిని మానవాళి అనుసరించినట్లయితే ప్రపంచ శాంతికి కృషి చేసిన వారవుతామన్నారు. గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ప్రకటనతో "అంతర్జాతీయ అహింసా దినోత్సవం" గా జరుపుకోవడం మన దేశానికి గర్వకారణమని, విద్యార్థులు మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా చేసుకొని ఎదగాలన్నారు.
తదుపరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఉపాధ్యాయులు దుర్గరాజు, శ్రీనివాసులు మరియు ఎన్సిసి పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణంలోని పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ పక్వాడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.
Comments