అమృత నగర్ లో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న, దేశవ్యాప్తంగా ప్రజలు మహాత్మా గాంధీ అహింస, సత్యం మరియు సామాజిక న్యాయ వారసత్వాన్ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటారు. మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృత నగర్ నందు ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ గావించారు. ఆయనతో పాటు కడప నగరానికి చెందిన డాక్టర్ నూరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. మహాత్మ జయంతి సందర్భంగా కేకును కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు అహింస మార్గంతో కృషిచేసి బీటలు వారిని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులని, దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. ఆపై డాక్టర్ నూరి ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యమ్మ, 13వ వార్డు మెంబర్ యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మెంబర్స్ పాల్గొనగా పెద్ద ఎత్తున అమృత నగర్ ప్రజలు విగ్రహావిష్కరణకు విచ్చేశారు.
Comments