పార్క్ పరిశుభ్రత పరిరక్షణ ప్రజల బాధ్యత - కమిషనర్
కడప జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం ఉదయం మునిసిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్ వెంకట రమణయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో ప్రొద్దుటూరు లోని మున్సిపల్ గాంధీ పార్కు శోభాయమానంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ ఆధునీకరణ పనులు చేపట్టి రాష్ట్ర హోంశాఖ మాత్యులు తానేటి వనిత, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే రాచమల్లు శివ, మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమి పూజ చేసిన నేపథ్యంలో ఇందులో భాగంగా పార్కును ప్రజలకు అంకితం చేశామని, కాగా పార్కు పరిశుభ్రత పరిరక్షణ ప్రజల చేతిలో ఉందని ఆయన పేర్కొన్నారు. పార్క్ ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదని, ప్రజల సౌకర్యార్థం పార్కు నందు క్యాంటీన్ ఏర్పాటు చేశామని, పలు సమస్యల కారణంగా ప్రజలు బయట నుంచి తెచ్చుకున్న తినుబండారాలు ఏవి కూడా ఇకపై పార్కులోనికి అనుమతించబోమని ఆయన తెలిపారు. చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులను పరిమితికి మించి ఉపయోగించటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని, పార్కులో తినుబండారాల వ్యర్ధాలు ప్రజలు వేసిన ఎడల అట్టివారికి 500 రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments