ఘనంగా గాంధీజీ 153 వ జయంతి వేడుకలు.
నివాళులర్పించిన ఎమ్మార్వో మురళీకృష్ణ - ఎన్సిసి క్యాడెట్ల స్వచ్ఛ పక్వాడ.
భారత జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతిని పురస్కరించుకొని చిట్వేలు మండల పరిధిలోని పలుచోట్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయం నందు రెవెన్యూ అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించడంలో గాంధీజీ కీర్తి చిరస్మరణీయమని,మానవాళి ఉన్నంతవరకు శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఎమ్మార్వో మురళీకృష్ణ పేర్కొన్నారు. వీఆర్వో భాస్కర్,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వచ్ఛ పక్వాడ:--- ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడేట్లచే పాఠశాల సిబ్బందితో కలిసి గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్ స్టాప్ పరిసరాల నందు ఎన్సిసి క్యాడేట్ లతో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చెత్త, పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ఆర్టీసీ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. వ్యక్తిగత పరిసరాల శుభ్రతతో పాటు, పబ్లిక్ స్థలాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తద్వారా స్వచ్ఛభారత్ ను సాధించవచ్చుని ఎన్సిసి అధికారి రాజశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సుబ్బరాయుడు, కిరణ్ కుమార్ రాజు నాగలేష్, రాకెబ్, ఎన్సిసి క్యాడేట్లు పాల్గొన్నారు.
Comments