కడప జిల్లా, చక్రాయపేట
గండి క్షేత్రం లో వైభవంగా శ్రావణ మాసం ఉత్సవాలు.
తమిళనాడు నుండి తెప్పించిన పూల తో ప్రత్యేక అలంకారం లో భక్తులకు దర్శననిస్తున్న ఆంజనేయ స్వామి, మూడవ శ్రావణ శనివారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు. దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కాలినడకన గండి క్షేత్రానికి చేరుకుంటున్న భక్తులు, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వేంపల్లె నుండి వెళ్ళే వాహనాలు వీరన్న గట్టు పల్లె సర్కిల్ లో రాయచోటి వైపు నుండి వచ్చే వాహనాలను అద్దాల మర్రి క్రాస్ వద్ద నిలిపివేస్తున్న పోలీసులు. ఆలయ సమీపం లో భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి,భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఈవో ముకుందా రెడ్ది, వేంపల్లె నుండి గండి క్షేత్రం వరకు దారి పొడవునా నడిచి వచ్చే భక్తులకు అన్నదానం , త్రాగు నీరు ను అందిస్తున్న దాతలు. గండి క్షేత్రం చుట్టు సిసి కెమెరాల తో కట్టు దిట్ట మైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఐ గోవింద్ రెడ్డి, ముందుండి ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తున్న ఆర్కే వ్యాలీ ఎసైరంగారావు,చక్రాయపేట ఎసై మల్లికార్జున రెడ్డి,దిశ పోలీస్ స్టేషన్ ఎసై మధు సుధన్ రెడ్డి.
Comments