హైదరాబాదును మించిపోనున్న ప్రొద్దుటూరు గణనాథుని లడ్డూ వేలం
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ గణనాథుని లడ్డు వేలానికి ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ఖైరతాబాద్ లడ్డూ తర్వాత పలు చోట్ల లడ్డువేలం అత్యధికంగా వేలం పాటలు పాడిన సందర్భాలు లేకపోలేదు, అయితే ప్రస్తుతం ప్రొద్దుటూరులోని రాజరాజేశ్వరి కాలనీ నందు వెలసిన శ్రీ సాయి రాజేశ్వరి గణపతి ఉత్సవ కమిటీ నందు దాదాపు 2 లక్షల 12 వేల నాలుగు రూపాయలకు లడ్డూ వేలాన్ని శశెట్టి సురేష్, వెండి నాణ్యాన్ని కాత్యాయని కన్స్ట్రక్షన్ అధినేత 43 వేలకు, 200 రూపాయల నోట్లు స్వామి వారి మాలను సి. వెంకట గోపాల్ రెడ్డి 55 వేలకు దక్కించుకోగా, స్వామివారి పూజలు అందుకున్న చెరుకును సి.కే ప్లైవుడ్ అధినేత 3016 రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు వ్యాప్తంగా మూడవరోజు నిమజ్జోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వేలం పాటలో అత్యధికంగా లడ్డూ వేలం పాట దక్కించుకున్న వారి జాబితాలు చేరనుంది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి, వరద కుమార్ రెడ్డి, కృష్ణ, మధుసూదన్ రెడ్డి, నాగిరెడ్డి, రఘునాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాజారెడ్డి, భక్తులు లడ్డూ వేలం పాటలు పాల్గొన్నారు.
Comments